|
|
అందరూ పాపం చేశారు! దేవుడు మానవుణ్ణి చేశాడు ... ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. ఆది. 1:1. ఆదియందు దేవుడే భూమిని, ఆకాశాన్ని కలుగజేశాడు. మానవుని తన స్వంత పోలికలో చేశాడు. అంతకు ముందే గ్రహాలను, వృక్షాలను చేపలను, పక్షులను, సమస్త భూజంతువులను సృష్టించాడు కాని మానవుణ్ణి మాత్రమే తన స్వంత పోలికతో చేశాడు.
మానవుడు జీవాత్మ ... దేవుడైన యెహోవా నేలమంతితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. ఆది. 2:7. దేవుని సృష్టి అంతటిలో మానవుడు ఎంతో శ్రేష్టుడు. మానవునిలో తన జీవవాయువును ఊదాడు. జంతువులకంటే భిన్నంగా దేవుడు మానవుని చేశాడు. అతడు భౌతిక శరీరం మాత్రమే కాదు జీవాత్మను కలిగి ఉన్నాడు.
దేవుని ఆజ్ఞ ... మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోటమధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేలనుండి మొలిపించెను. ఆది. 2:9. మరియు దేవుడైన యెహోవా నరుని తీసికొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను. దేవుడు ఏదెను వనములో పలురకాల వృక్షాలతో ఒక తోటను నాటాడు. ఆ యొక్క తోటమధ్యలో రెండు ప్రాముఖ్యమైన వృక్షాలున్నాయి. ఒకటి జీవవృక్షము రెండవది మంచిచెడ్డలతెలివినిచ్చు వృక్షము. దేవుడు ఆ అందమైన చెట్లకున్న ప్రతిఫలాన్ని నీవు నిరభ్యంతరంగా తినవచ్చని చెప్పాడు. అయితే ఈ రెండు ప్రాముఖ్యమైన చెట్లలో ఒకటైన మంచిచెడ్డలతెలినిచ్చు వృక్షఫలాన్ని నీవు “తినకూడదు!” అని చెప్పాడు. దేవుడు ఆ చెట్టుఫలాన్ని నిషేధించటం మాత్రమే కాదు. దానిని తిను దినమున నీవు తప్పక మరడిస్తావు అని చెప్పాడు.
మానవుడు దేవునికి అవిధేయుడయ్యాడు... స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొని తినెను, మరియు తనతోపాటు తన భర్తకును ఇచ్చెను, అతడుకూడ తినెను; ఆ పండుయొక్క రమ్యమైన ఆకారాన్ని చూచినప్పుడు అది నిజంగా జ్ఞానాన్నిస్తుందని నమ్మకం కలిగింది, సర్పముచేత ప్రేరేపించబడి, మోసగించబడిన తర్వాత అమె ఆ పండును తిన్నది. అప్పుడు ఆమె తిని కొన్నింటిని తన భర్తకు యిచ్చింది అతడు కూడా తిన్నాడు. “ఆ వృక్షఫలము తినుదినమున” - “నిశ్చయముగా చచ్చెదవు” ఆదాము తిన్నాడు - కానీ మరణించాడా ? అతడు మరణించాడా? అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను; వారు చనిపోయారా? వారి కళ్ళు తెరవబడ్డాయి. వారు అంజూరపు ఆకులను కుట్టి బట్టలుగా ధరించారు. భౌతికంగా వారు జీవించి క్షేమంగానే ఉన్నారు. ఆదాము హవ్వలు శారీరకంగా మరణించలేదని మనకు అర్థమవుతోంది. “నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు”
మానవుని ఆధ్యాత్మిక మరణము చల్లపూట ఆదామును అతని భార్యయు తోటలో సంచరించున్న దేవుడైన యెహోవా స్వరమునువిని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండ తోటచెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి - నీవు ఎక్కడ ఉన్నావనెను? అందుకతడు తోటలో నీ స్వరము విన్నప్పుడు దయచేసి గమనించండి. వారు దేవుని ఆజ్ఞకు అవిధేయులు కాకముందు ఎలావున్నారో వాక్యం స్పష్టంగా చెబుతోంది. ఆది. 2:25. “అప్పుడు ఆదామును అతని భార్యయు దిగంబరులుగా ఉండిరి. ఇప్పుడు, వారు నిషేధింపబడిన ఫలాన్ని తిన్న తర్వాత వారిరువురు తాము దిగంబరులమని గ్రహించి కచ్చడాలు చేసుకుని దేవుని సన్నిధినుండి దాగుకొన్నారు. దేవుని పిలుపు విన్నప్పుడు ఆదాము హవ్వలు భయపడ్డారు. వారిలో బచ్చితంగా సంభవించిన ఆ మార్పు కేవలం భౌతికమైనది కాదు, అంతరంగంలోనిది. అవును, వారు లోపల చనిపోయారు. దేవుడు చెప్పినట్లుగా వారు చనిపోయారు. అయితే అది శరీరమరణం కాదుగాని ఆత్మీయ మరణం. (ఎఫెసీ 2:5, కొలస్సీ 2:13).
బైబిలు మరోచోట ఇలా చెబుతోంది. ఆదాము కుమారుని సంగతేమిటి ? ఆదాము నూట ముప్పది యేండ్లు బ్రదికి ఆదాము తన కుమారుని కన్నాడు. అయితే ఆ బిడ్డ తన తండ్రియైన ఆదాము రూప రేఖల్లోనే పుట్టాడని వ్రాయబడింది.
ఆదాము దేవుని పోలికలో సృష్టించబడ్డాడు. షేతు తన తండ్రియైన ఆదాము స్వరూపమందు ఆదాము పోలికలో ఆధ్యాత్మిక మరణంతో జన్మించాడు. కాబట్టి షేతు పుట్టుకతోనే ఆధ్యాత్మికంగా మరణించియున్నాడు. ఇదే సత్యం మానవులందరికి వర్తిస్తుంది. ఏమి జరిగిందో పూర్తిగా అర్థంచేసుకోవాలంటే మనం రోమా 5:12 చూదాలి. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును ఆదామను ఒక మనుష్యుని ద్వారా పాపము లోకములో ప్రవేశించింది. దాని ఫలితం ఆధ్యాత్మిక మరణం, ఈ ఆధ్యాత్మిక మరణం మానవులందరికి సంప్రాప్తించింది. ఆదాము సంతతియైన ప్రతీ మానవుడు ఆధ్యాత్మిక మరణంతోనే ఈ లోకంలో పుడుతున్నాడు. నీక్కూడా ఇదే సత్యం వర్తిస్తుంది. ఆదాము దేవునికి వ్యతిరేకి అయినందున అతని సంతానసంబంధులందరికి ఏం జరిగిందో ఈ క్రింది మూడు వచనాలు తెలియజేస్తున్నాయి.
అనేకులకు విస్తరించెను. రోమా 5:15. ఆదాము శరీర సంబంధులందరు ఆధ్యాత్మికంగా మృతులు మాత్రమే కాదు, వారు శిక్ష విధించబడి లేఖనాలలో దేవుని చేత పాపులు అని పిలువబడుతున్నారు. దయచేసి గమనించండి. ఈ పరిస్థితి ఒకని అవిధేయత ద్వారా మాత్రమే కలుగలేదు. లేఖనము ఈ రీతిగా సెలవిస్తుంది. ఒక వ్యక్తి అపరాధం ద్వారా అందరూ మరణించారు. ఆదాముతో మనకున్న సంబంధం మనలను ఆధ్యాత్మికంగా మృతులను చేస్తే... సమాధానం మన పుట్టుకతోనే నేను పాపములో పుట్టినవాడను పాపములోనే మనం తల్లి గర్భములో పడ్డప్పుడే ఆదాముతో మనకు బాంధవ్యం ఏర్పడింది. మనకు రెండు కళ్ళు, ఒక ముక్కు లేఖనానుసారంగా -- మృతమైన ఆత్మ, మనందరికీ ఇవే ఉన్నాయి. మనం తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే మానవ జాతిలో లెక్కించబడిన మరుక్షణంలోనే నీవు ఆదాము సంబంధివి, మరణంతో, శిక్షావిధితో, ఉన్న పాపివి. ఇలాగు వ్రాయబడి ఉంది. ఆదాము సంబంధిగా పుట్టిన, భౌతిక మానవుని స్థితిని గురించి దేవుడీవిధంగా చెబుతున్నాడు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని పాపము చేయక మేలు చేయుచుండు మనమందరము గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతిమి... మేమందరము అపవిత్రులవంటివారమైతిమి ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా - నీతిమంతుడు లేడు, మీరు వాటిని చేయుచు, వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించుశక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మముచొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరముయొక్కయు మనస్సుయొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావసిద్ధముగా దైవాగ్రతకు పాత్రులమైయుంటిమి. మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు మరియు అపరాధముల వలనను, శరీరమందు సున్నతిపొందక అందరూ పాపం చేశారు... ముగింపు, ఒక మనుష్యుని ద్వారా పాపం ఈ లోకంలో ప్రవేశించింది. పాపం ద్వారా మరణం వచ్చింది. ఆ మరణం మానవులందరికి సంప్రాప్తమైంది. ఈ కారణం చేత మానవజాతి యావత్తు
కాబట్టి మనకు రక్షకుడు అవసరమైయున్నాడు! సంబంధిత వ్యాసాలు
|