ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము...

లేఖనాల ప్రకారం మానవజాతి యావత్తు ఆత్మీయకంగా మృతమైంది. పాపాన్ని బట్టి దేవుని నుండి వేరుచేయబడి శిక్షావిధిక్రింద ఉన్నారు. క్రీస్తునంగీకరించకుండా వారు మరణించినట్లయితే అగ్నిగంధకాలతో మండుగుండమైన “రెండవ మరణము” ను అనుభవించవలసి ఉంది. మనయొక్క నీతిక్రియలన్నియు మురికిగుడ్డలవంటివని దేవుడు చెప్పినందున, మానవుడు తన్ను తాను రక్షించుకోలేని పూర్తి నిస్సహాయస్థితిలో పడిపోయాడు. సహాయము చేయువారులేరు. నిరీక్షణలేదు. అయితే దేవుడు తన కృపను బట్టి ప్రభువైన యేసుక్రీస్తును ఈలోకానికి పంపాడు. ఆయన తన మరణంద్వారా పాపరుణమంతటిని తీర్చివేశాడు. సమాధిచేయబడ్డాడు. తిరిగి మూడవదినాన లేచి ఆరోహణుడై పరలోకానికి వెళ్ళాడు. ఆయనే ఏకైక మధ్యవర్తిగా పాపాలనుండి విముక్తికలిగించాడు. యేసుక్రీస్తు మాత్రమే మరణించి శిక్షావిధిక్రింద ఉన్న పాపుల రక్షణకు ఏకైకమార్గమైనాడు. ఆయన మరణం తర్వాత జీవాన్ని వాగ్దానం చేశాడు. తీర్పులేదు, ఆధ్యాత్మికమరణం ఇంక ఎంతమాత్రమును లేదు. ఈ భౌతిక శరీరంలో ఆత్మీయజీవాన్ని కలిగియున్నాడు. ఆత్మలో తిరిగిజన్నించి నూతన జీవాన్ని పొందుటకు మానవుడు ఏం చేయగలడు?

ఆయనను నమ్ము...

వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు మేమేమి చేయవలెనని ఆయన అడగగా యేసు - ఆయన పంపినవానియందు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పెను. యోహాను 6:28,29.


“...విశ్వాసముంచువాడు నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.”
యోహాను 3:16.

“...విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక..”
యోహాను 3:18.

“..విశ్వసించువాడే నిత్యజీవము గలవాడు..అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను..”
యోహాను 6:47.

“..అయ్యలారా రక్షణపొందుటకు నేనేమి చేయవలెను. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణపొందుదురు.”
యోహాను 16:31.

“ఆయన ఆజ్ఞ ఏదనగా - ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును ఒప్పుకొని..”
1యోహాను 3:23.


నా మాటలు విని నన్ను పంపినవానియందు విశ్వసించు...

“నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవముగలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములోనుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.”
యోహాను 5:24.

“తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి అనగా తనునామమందు విశ్వాసముంచినవారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తమువలననైనను శరీరేచ్ఛలవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు.”
యోహాను 1:12,13.

యేసుక్రీస్తు అందరికి ప్రభువు....


మీరు మ్రానున వ్రేలాడదీసి చంపిన ఆయనను దేవుడు మూడవ దినమున లేపెను.

ఆయనయందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరు ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారు... (అ.పో. 10:36,40,43,).

చంపబడిన.. యేసును.. దేవుడు మృతులలోనుండి లేపెను. మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నది...

మోషేధర్మశాస్త్రమువలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేక పోతిరో.. (అ.పో. 10:36,40,43, 13:29,38.)

“నీ హృదయమందు విశ్వసించినయెడల, రక్షణ కలుగునట్లు నీ నోటితో ఒప్పుకొనుము.”
రోమా 10:9,10.


లేఖనాల్లో వ్రాయబడిన విధంగా, హృదయంలో విశ్వసించినవాడే దేవునిదృష్టిలో నీతిమంతుడు.

యేసుక్రీస్తు అందరికి ప్రభువు....

మీరు మ్రానున వ్రేలాడదీసి చంపిన ఆయనను దేవుడు మూడవ దినమున లేపెను.

ఆయనయందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందును... మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నది. (అ.పో. 10:36,40,43,).

దేవునితో సమాధానపడుదని క్రీస్తు పక్షముగా బతిమాలుకొనుచున్నాము. 2 కొరింథి. 5:20.

ఆత్మయు పెండ్లికుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పిగొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ప్రకటన 22:17.


నీవు రక్షణ పొందావా? నీవెలా తెలుసుకున్నావు? నీవు రక్షించబడ్డానని అభిప్రాయపడుతున్నావా? లేక రక్షించబడ్డానను కుంటున్నావా? రక్షించబడ్డావని సరిగ్గా గ్రహించావా? ఈ వచనభాగాన్ని పరిశీలించు...

యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను.

“దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచునట్లు..”
1యోహాను 5:13.

మీరు గత కాలపు అనుభూతుల ఉద్రేకాలమీద ఆధారపడటం కంటే మారని మార్పులేని అమోఘమైన దేవుని వాక్యం మీద ఆధారపడటం మంచిది. యోహానంటున్నాడు మీరు తెలుసుకొని నిత్యజీవం పొందునట్లు ఈ విషయాలు వ్రాస్తున్నాను. ఇంకా ఇలాగు వ్రాయబడి ఉంది.

ఘనతవహించిన థియోఫిలా, ఆరంభమునుండి కన్నులారా చూచి వాక్యసేవకులైనవారు మనకు అప్పగించిన ప్రకారము మనమధ్యను


నెరవేరిన కార్యములనుగూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలిసికొనుటకు వాటినన్నిటిని మొదటనుండి తరచి పరిష్కారముగా తెలిసికొనియున్న నేనును నీ పేరట వాటినిగూర్చి వరుసగా రచించుట యుక్తమని యెంచితిని.

లూకా 1:3-4.

లూకా వ్రాస్తున్నాడు తాను కండ్లారా చూసిన సంఘటనలను తనకు బోధించబడిన దైవసందేశాన్ని క్రమపద్ధతిలో వ్రాయడం ఉత్తమని గ్రహించాడు. మరో వచనాన్ని చూడండి.

నిన్ను పంపువారికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తరమిచ్చునట్లు సత్యప్రమాణము నీకు తెలియజేయుటకై ఆలోచనయు తెలివియుగల శ్రేష్ఠమైన సామెతలు నేను నీకొరకు రచించితిని.

సామెతలు 22:20-21.

మనకివ్వబడిన వాక్యము సత్యమని తెలుసుకొని ఆ సత్యమును నమ్మునట్లు ఈ విషయాలు వ్రాయబడ్డాయి. వీటితో మనమేమి చేయాలి. దేవుడు ఆయన ఆజ్ఞలను ఉపదేశాలను మరువక ధ్యానించాలని హృదయంమీద వ్రాసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. సామెతలు 7:3.


సువార్తకు లోబడు

మరియు ఆయన సంపూర్ణసిద్ధి పొందినవాడై, మెల్కీసెదెకుయొక్క క్రమములోచేరిన ప్రధానయాజకుడని దేవునిచేత పిలువబడి, తనకు విధేయులైన వారికందరికిని నిత్య రక్షణకు కారకుడాయెను. హెబ్రీ 5:9.

కొంతమంది ఈ వచనాన్ని ఆధారం చేసుకొని మన నిత్యరక్షణ కొన్ని క్రియలమీద ఆధారపడి ఉందని బోధిస్తారు. మనం చేసే ప్రతి పనిలో ప్రభువైన యేసుక్రీస్తుకు విధేయులమై ఉండకపోతే మనం నిత్యజీవాన్ని స్వతంత్రించుకోలేం. దేవుని ఆజ్ఞలను పాటిస్తూ నడచుకొని యేసుక్రీస్తును.. నమ్ముకొని...అనే ఆజ్ఞకు విధేయులమైతే రక్షించబడతాము. 1యోహాను 3:23.

ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింపవలెననదియే. 1యోహాను 3:23.

ఇందులో మారుమనస్సుకూడా ఇమిడి ఉంది. అపొస్తలుడైన పౌలు ఆజ్ఞాపిస్తున్నాడు.


ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. అపొ. 17:30-31.

ప్రభువైన యేసు..పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై, దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడనివారికిని ప్రతిదండన చేయును... 2 థెస్స. 1:8.

విశ్వసించుచున్న మీకు, ఆయన అమూల్యమైనవాడు, విశ్వసింపనివారికైతే - ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయెను. మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు అయెను. కట్టువారు వాక్యమున కవిధేయులై తొట్రిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. 1పేతురు 2:6-8.


తీర్పు దేవుని ఇంటియొద్ద ఆరంభమగు కాలము వచ్చియున్నది; అది మనయొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి యేమవును? 1పేతురు 4:17.

అయినను అందరు సువార్తకు లోబడలేదు - ప్రభువా, మేము తెలియజేసిన సమాచారమెవడు నమ్మెను. అని యెషయా చెప్పుచున్నాడు గదా? రోమా 10:16.

ఈయన నామమునిమిత్తము సమస్తజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపొస్తలత్వమును పొందితిమి. రోమా 1:5.

సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు, అనాదినుండి రహస్యముగా ఉంచబడి


యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్యదేవుని ఆజ్ఞప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడినవి. ఈ మర్మమును అనుసరించియున్న నా సువార్త ప్రకారముగాను, యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను... రోమా 16:25-26.

ముగింపులో, ప్రభువైన యేసుక్రీస్తునందు విధేయతద్వారాగాని (దేవుని క్రియద్వారా గాని) విశ్వాసముంచుట రక్షింపబడుటకవసరం.

“మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడవీలులేదు.”
ఎఫే 2:8-9.


సంబంధిత వ్యాసాలు


Know the Truth