|
|
పాపము = మరణము పాపము దేవునికి మానవుని దూరపరచింది. పాపము దేవుణ్ణి మానవుణ్ణి వేరుపరచింది. మానవుడు బౌతికంగా పాపి కాబట్టి ఈ ఎడబాటును ఈ విధంగా ఉదహరించవచ్చు:
అందరూ పాపం చేశారు... “అందరును పాపము చేసి, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు.” ఆదాము అవిధేయత ఫలితంగా శిక్షావిధికి కారణమైన మరణం సంభవించింది. ఈ సత్యం సార్వజనీనమైనది. జాతి, మత, సాంఘిక ఆర్థిక కారణాలేవైనా అందరికీ ఇదే సత్యం వర్తిస్తుంది. అందరూ పాపం చేశారు... మానవ జాతి యావత్తు ఉద్ధవించిన అవస్థను ఈ విధంగా పిలవవచ్చు
అందరూ పొందలేక పోయారు... “అందరును పాపము చేసి, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు.” అందును బట్టి ఆదాము సంబంధములైన మానపులందరు, ప్రతి ఒక్కరు శిక్షావిధిలో, పాపులై మరణించి దేవుడు ఆశించినస్థాయిని పొందకుండా పోయారు. దేవుని మహిమ
పాపము వలన వచ్చు జీతము మరణము “ప్రకారము పాపం వలన వచ్చు జీతం మరణం, కాని దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసు నందు నిత్యజీవం.” ఈ వచనం మనకు పాపం వలన కలిగే ప్రతిఫలం లేక ఫలితం మరణమని చెబుతోంది. ఇక్కడ మనం “మరణం” అంటే ఏంటో తెలుసుకోవాల్సి ఉంది. మరణం అనే మాట మన ఆధ్యాత్మిక చచ్చినస్థితిని చూపుతోంది. “మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు...” ఏమైతేనేం ఇక్కడ రోమా 6:23 ఈ మరణాన్ని నిత్యమరణమని వర్ణిస్తోంది. “...ఈ అగ్నిగుండము రెండవ మరణము...” రెండవ మరణము “మరణమును మృతులలోకమును అగ్నిగుండములో పడవేయబడెను; ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంధమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను.” ఇంకా ఆత్మీయంగా మరణించిన స్థితిలో ఉన్నవారు, జీవగ్రంధములో పేరు వ్రాయబడని వారు చనిపోయినప్పుడు అగ్నిగుండములో వేయబడతారు.
లేఖనము ఈ మాటను ఎప్పుడు చెబుతోందంటే “పాపముపలన వచ్చు జీతము మరణము,” మన మురికి వస్త్రాలు దేవుని అవసరాన్ని గుర్తించిన అనేకమంది దేవునితో కోల్పోయిన సంబంధాన్ని నెలకొల్పుకోవడానికి “ఏదోఒకటి” చేయడానికి ప్రయత్నిస్తారు. వారు దేవునికి తమకు ఉన్న ఆ అడ్డంకిని తొలగించుకోడానికి ఓ వంతెనను నిర్మించుకోజూస్తారు. కొంత మంది ఇతరులకు సహాయపడుతూ, ధర్మ కార్యాలు చేస్తూ, పేదలకు సహాయపడుతూ, మంచిపనులు చేస్తుంటారు. కొంతమంది మత సంబంధమైన అభ్యాసాలు చేస్తూ పూజాకార్యక్రమాలకు హాజరవుతూ ప్రార్థనలు ఉపవాసాలు చేస్తుంటారు. కొంతమంది మత ఆచారాలు అనగా బాప్తిస్మము తీసుకోడం, ప్రభువు బల్లలో పాలుపొందడం వంటివిచేస్తూ తాము దేవుని శిక్షావిధిక్రింద చచ్చిన స్థితిలో లేమని భావిస్తుంటారు. మన దృష్టిలో నీతికార్యాలైన వీటిని చేస్తూ దేవుని సమీపించినపుడు, వీటిని “మురికి గుడ్డలు” అని ఈ క్రింది వచనములో అంటున్నాడు. “మేమందరము అపవిత్రులవంటివారమైతిమి
క్రియల వల్ల కాదు మానవుడు ఏదైనా ఒక పని లేదా కొన్నికార్యాలు చేయుటం ద్వారా తన పాపస్థితినుండి తన్ను తానూ రక్షించుకోగలడా? పరిశుద్ధ దేవుని ఎదుట తన మీద ఉన్న శిక్షావిధిని తీసివేసుకొని ఆధ్యాత్మికజీవాన్ని పొందగలడా? లేఖనం ఏమి చెబుతోంది? “మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు.” “మీవలన కలిగినది కాదు” మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక, తన కనికరము చొప్పననే పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. ఆ పరిశుద్ధాత్మను మనరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మనమీద సమృద్ధిగా కుమ్మరించెను. “క్రియలమూలముగా కాదు” “పనిచేయక, భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువానియందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది” “క్రియలమూలముగా కాదు విశ్వాసము ద్వారానే” అది కృపచేతనైన యెడల ఇకను క్రియల మూలమైనది కాదు; కానియెడల కృప ఇకను కృప కాకపోవును. “క్రియల ద్వారా కాదు” లేఖనముల ప్రకారము ఏ కార్యమువల్లగాని, క్రియలవల్ల కాని, భక్తివల్లగాని మానవుడు దేవునియెదుట తన్నుతాను అంగీకార యోగ్యునిగా చేసుకోలేనిస్థితిలో ఉన్నాడు. తాను స్వభావసిద్ధంగా అపరిశుద్ధుడుగా ఉన్నాడు. తన నీతిక్రియలన్ని మురికిగుడ్డలవలె ఉన్నాయి. అతడు బలహీనుడుగాను తన్ను తాను రక్షించుకోలేని నిస్సహాయుడుగాను ఉన్నాడు. అతడు నశించిపోతున్నాడు. అతడు సహాయము కొరకు దేవునివైపే చూడవలసి ఉంది. తాను ఏదైనా చేయాలని ప్రయత్నించినపుడల్లా ఏం జరిగిందో వ్రాయబడింది. “...మీవలన కలిగినది కాదు...”
పాపము వలన మరణము ముగింపు, మానవజాతి సంబంధులందరూ:
నిజంగా మనకొక రక్షకుని అవసరం ఉంది. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను సంబంధిత వ్యాసాలు
|