దేవుని వాక్యమును వినుట

మనము ఎట్లు రక్షింపబడుదుము

“కాగా వినుటవలన విశ్వాసము కలుగును,
వినుట క్రీస్తునుగూర్చిన మాటవలన కలుగును.”
రోమీయులకు 10:17
“ఇది మాత్రమే మీవలన తెలిసికొనగోరుచున్నాను;
ధర్మశాస్త్రసంబంధ క్రియలవలన ఆత్మను పొందితిరా
లేక విశ్వాసముతో వినుటవలన పొందితిరా?”
గలతీయులకు 3:2
“ఆత్మను మీకు అనుగ్రహించి, మీలో అద్భుతములు చేయించువాడు
ధర్మశాస్త్రసంబంధ క్రియలవలననా
లేక విశ్వాసముతో వినుటవలననా చేయించుచున్నాడు?”
గలతీయులకు 3:5
“ఎందుకనగా ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయువాడెవడో వాడు రక్షింపబడును.
వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విననివానిని ఎట్లు విశ్వసించుదురు?
ప్రకటించువాడు లేకుండ వారెట్లు విందురు?”
రోమీయులకు 10:13-14
“మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని,
క్రీస్తునందు విశ్వాసముంచి,
వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి.”
ఎఫెసీయులకు 1:13
“పరలోకమందు మీకొరకు ఉంచబడిన నిరీక్షణనుబట్టి, క్రీస్తుయేసునందు మీకు కలిగియున్న విశ్వాసమునుగూర్చియు, పరిశుద్ధులందరిమీద మీకున్న ప్రేమనుగూర్చియు, మేము విని యెల్లప్పుడు మీ నిమిత్తము ప్రార్థనచేయుచు, మీయొద్దకు వచ్చిన సువార్త సత్యమునుగూర్చిన బోధవలన ఆ నిరీక్షణనుగూర్చి మీరు ఇంతకుముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు, వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపనుగూర్చి విని సత్యముగా గ్రహించిన నాటనుండి మీలో సయితము ఫలించుచు వ్యాపించుచున్నది.”
కొలొస్సయులకు 1:3,5-6

గమనిక: దేవుని వాక్యము రక్షణను మరియు ఆత్మీయ ఎదుగుదలను రెంటిని కలుగజేయును.


పరిశుద్ధులకు

“మేము చూచినదానిని వినినదానిని మీకును తెలియజేయుచున్నాము,
మాతోకూడ మీకును సహవాసము కలుగునట్లు:
మన సహవాసమైతే తండ్రితో కూడను
ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోకూడను ఉన్నది.”
1 యోహాను 1:3
“నా గొఱ్ఱలు నా స్వరము వినును,
నేను వాటినెరుగుదును,
అవి నన్ను వెంబడించును;
నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను గనుక
అవి ఎన్నటికిని నశింపవు,
ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు.”
యోహాను 10:27-28
“సమయము సమీపించినది గనుక
ఈ ప్రవచనవాక్యములు చదువువాడును,
వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు.”
ప్రకటన 1:3

వినుటమాత్రమే చేసి ఆచరింపకపోవుట అను సమస్య

“నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు
మంచి స్వరము కలిగిన గాయకుడవుగా ఉన్నావు,
వారు నీ మాటలు విందురు
గాని వాటిని అనుసరించి నడుచుకొనరు.”
యెహెజ్కేలు 33:32
“మీరు వినువారు మాత్రమైయుండి
మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ,
వాక్యప్రకారము ప్రవర్తించువారునైయుండుడి.”
యాకోబు 1:22
“అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలుకడగా ఉండువాడెవడో
వాడు విని మరచువాడు కాక,
క్రియను చేయువాడైయుండి తన క్రియలో ధన్యుడగును.”
యాకోబు 1:25
“వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను,
గాని వారు వినినవారితో విశ్వాసముగలవారై కలిసియుండలేదు
గనుక విన్న వాక్యము వారికి నిష్‌ప్రయోజనమైనదాయెను.”
హెబ్రీయులకు 4:2

కావున, ఈ క్రిందివానిగా కాకుండునట్లు మనము జాగ్రత్తపడవలెను:

ఉదాహరణకు,

“యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను
వారు చెవియొగ్గకపోయిరి.”
2 దినవృత్తాంతములు 33:10

మరియు

“అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై
వినకుండ చెవులు మూసికొనిరి.”
జెకర్యా 7:11

మూల్యాంకన పద్ధతి:

సంఘములో గాని, బైబిలు అధ్యయనములో గాని, టెలివిజనులో గాని, ఇతరులు దేవుని వాక్యమును బోధించుచుండగా నేను వినుచున్నప్పుడు, నేను మంచి, ప్రభావవంతమైన వినేవాడనేనా? వినుట విషయములో నీవెట్లు చేయుచున్నావో మూల్యాంకనము చేయుటకు ఈ క్రింది పద్ధతి సూచింపబడుచున్నది.


వినుట టాబ్ను ప్రయత్నించుము, బైబిలులోని ఏ గ్రంథమునైనను ఒక్కొక్క అధ్యాయముగా చదివి వినిపించుటకు.

← వాక్య స్వీకరణకు తిరిగి వెళ్ళుము