వాక్యమును స్వీకరించుట మరియు దాని సత్యములను ప్రకాశింపజేయుటకు పరిశుద్ధాత్మపై ఆధారపడుట అను సూత్రములను ఎట్లు అన్వయించవచ్చునో చూపు నమూనాలుగా ఈ అధ్యయనములు ఉన్నాయి. ఈ సంగతులు ఆలాగున్నవో లేవో తెలిసికొనుటకు బెరయవారివలె లేఖనములను ప్రతిదినమును పరిశోధించమని పాఠకుని ప్రోత్సహించుచున్నాము (అపొస్తలుల కార్యములు 17:11).