వాక్యము యొక్క ప్రాముఖ్యత

క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై,
నిర్మలమైన వాక్యమను పాలను అపేక్షించుడి,
దానివలన మీరు ఎదుగుదురు.
1 పేతురు 2:3

నీటికాలువల యోరను నాటబడిన ఫలవంతమైన చెట్టువలె ఉండాలని, నీ క్రియలలో ఆశీర్వదింపబడాలని, దేవుడు నిన్ను దర్శించాలని, దైవస్వభావములో పాలివాడవు కావాలని, క్రమేణా క్రీస్తు పోలికగా మార్చబడాలని కోరుకుంటున్నావా? దయచేసి ఈ మూడు వ్యాసములను పరిశీలించుము:

దేవుని వాక్యమునకు మన జీవితములను రూపాంతరపరచు శక్తి యున్నదనియు, పొందదగిన వాగ్దానములు కలిగియున్నదనియు, జీవమునకును భక్తికిని కావలసినవన్నియు మనకనుగ్రహించుననియు అయినయెడల, ఆ వాగ్దానములను పొందుటకు నీవేమి చేయబోవుచున్నావు?

ఆచరణాత్మక సూచనలకొరకు దయచేసి దేవుని వాక్యమును స్వీకరించుట చూడుము, మరియు పరిశుద్ధాత్మ నీకు బోధించి నడిపించును అనునది కూడ చూడుము.