ఈ వ్యాసము పాఠకుని ఈ క్రింది ప్రశ్నపై లేఖనములను పరిశీలించుటకు సవాలుచేయును : ప్రతివారము ఒకే పాస్టరు ప్రసంగించవలెనా, లేక (పరిశుద్ధాత్మ మనుష్యులను మాటలాడుటకు నడిపించిన కొలది) అందరు మనుష్యులనుండి ప్రసంగము రావలెనా? దయచేసి ఈ క్రింది వచనభాగమును పరిశీలించుము :
ప్రతివాని వ్యక్తిగత భాగముచేత సంఘము క్షేమాభివృద్ధి చెందవలెననునదియే ఉద్దేశమని స్పష్టముగా కనబడుచున్నది (1 కొరింథీయులకు 14:5,16). పౌలు ఎఫెసు సంఘమునకు వ్రాసిన పత్రికలో ఇది మరల కనబడుచున్నది :
సంఘము దేవుని “నానావిధమైన కృప” (1 పేతురు 4:10) ద్వారా క్షేమాభివృద్ధి చెందవలెనని దేవుడు వేరువేరు మనుష్యులకు వేరువేరు వరములను దయచేసెను. దేవుని వరములన్నియు ఒక్క మనుష్యునియందు ఉండవు. కావున, క్రీస్తు శరీరమును క్షేమాభివృద్ధిపరచు కార్యమంతయు ఒక్క మనుష్యుడు చేయలేడు. శరీరము ఏకమై పనిచేయవలసిన అవసరతను పౌలు 1 కొరింథీయులకు వ్రాసిన పత్రికలో మరల నొక్కిచెప్పుచున్నాడు :
ప్రధానత్వమును కోరిన, గుంపును ఏలవలెనని కోరిన ఒక మనుష్యునికి, దియొత్రెఫేకు, ఇది ఒక ఉదాహరణ. సంఘము మొత్తమునకు ఒక్క వ్యక్తి అధికారియైయుండుట ప్రమాదకరము. నియంత్రణలకు తనిఖీలకు అవకాశము ఇవ్వదు. అమెరికా రాజ్యాంగమును వ్రాసినవారు కూడ, ఒక పెద్దల సంఘము, అనగా కలిసి ప్రభుత్వమును నడుపు మనుష్యుల గుంపు అను తలంపుమీద ఈ వ్యవస్థను రూపొందించిరి. సంఘపు పెద్దలకు పేతురు ఇచ్చిన ఆజ్ఞ : “దేవుని మందను కాయుడి” (1 పేతురు 5:2), అయితే “మీకు అప్పగింపబడినవారిపైన ప్రభువులవలె కాక, మందకు మాదిరులుగా ఉండుడి” (1 పేతురు 5:3).
మనము ప్రతివారము కూడుకొని సమావేశమగుటకు కారణము (1) రొట్టెవిరుచుట (అపొస్తలుల కార్యములు 2:42), (2) ప్రార్థన, (3) అపొస్తలుల బోధ, (4) ప్రేమ సత్కార్యములకొరకు ఒకనినొకడు ప్రోత్సహించుటయు హెచ్చరించుటయు (హెబ్రీయులకు 10:24-25), (5) కీర్తనలతోను గీతములతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికొకడు బోధించుటయు హెచ్చరించుటయుననునది జ్ఞాపకముంచుకొనవలెను :
కాదు. అప్పుడప్పుడు ఒక ప్రత్యేక ప్రాంతపు సంఘమునకు ఎవడైన వచ్చి మాటలాడెడివాడని కనబడుచున్నది. ఇందుకు ఒక ప్రసిద్ధమైన ఉదాహరణ ట్రోయసులోని సంఘమునకు పౌలు ప్రసంగించుటయే. ఆదివారమున వారు రొట్టెవిరుచుటకు కూడినప్పుడు, పౌలు “మరునాడు వెళ్లనైయుండి…అర్ధరాత్రివరకు” వారితో ప్రసంగించెను (అపొస్తలుల కార్యములు 20:7).
అయితే, ఒక్క వ్యక్తియే ప్రతివారము ప్రసంగించుచు, ఒకనినొకడు ప్రోత్సహించుటకును హెచ్చరించుటకును, ఇతరులనుండి వినుటకును అవకాశము లేకుండినయెడల, దేవుడు నియమించిన రీతిగా శరీరము క్షేమాభివృద్ధి చెందుటలేదు. మరియు “మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమివిత్తునో ఆ పంటనే కోయును” (గలతీయులకు 6:7). మనము విత్తినదానినే కోయుదుము. దేవుని వాక్యపు బోధలను జాగ్రత్తగా అనుసరింపనియెడల, సంఘము శ్రమపడును. ఆయన నియమించిన రీతిగా విధేయతతో చేయుటవలననే సంఘపు నిజమైన వృద్ధి కలుగగలదు (యెహోషువ 1:8, కీర్తనలు 37:23, 1 కొరింథీయులకు 14:40).
వ్రాయబడినదానిని నీవు పరిశీలింతువనియు, బెరయవారివలె ప్రతిదినము లేఖనములను పరిశోధించి ఈ సంగతులు ఆలాగున్నవో లేవో చూతువనియు మా ప్రార్థన :