“దేవునితో ప్రతిదినము సహవాసము చేయవలెనని నిజముగా నీవు తలంచుచున్నావా?” అని ఒక సహోదరుడు అడిగిన ప్రశ్నకు జవాబుగా ఈ క్రింది పత్రిక వ్రాయబడెను, వారానికొకసారి సంఘమునకు వెళ్లి అప్పుడప్పుడు లేఖనములు చదువుటకు భిన్నముగా.
ఆ దినమున నీవు అడిగిన ప్రశ్న నాకు మిక్కిలి మేలు కలుగజేసెను. అనేక సంవత్సరములుగా నేను ప్రతిదినము ప్రభువుతో సన్నిహిత సహవాసము చేయవలెనని వెదకుచున్నాను, ఆయనకు లోబడి తద్వారా నా ప్రేమను చూపుటకు ఆయన స్వరమును వినవలెననెడి కోరికతో. ప్రతిదినము దీనిని చేయవలెననెడి ప్రేరణ నాకు కలుగుచుండెను. అయితే, ఆ దినమున నీవు ఆ ప్రశ్న అడిగినప్పుడు, —“నేను ఇట్లు ఎందుకు తలంచుచున్నాను?” అని నన్ను నేనే అడుగుకొనవలసివచ్చెను. అప్పటినుండి నేను ఇట్లు తలంచుటకు కారణమేమో పరిశోధించుచునే ఉన్నాను. నా చిన్ననాటిలో ఎక్కడనైన ఎవరైన బోధించగా వినుటవలననా ఇది కలిగెను? ఎక్కడైన చదివితినా? నా స్వంత మనస్సులో ఈ తలంపులను నేనే కల్పించుకొంటినా? లేక — గతమున ఏదో సమయమున నేను ఆయన వాక్యమునందు ధ్యానించియున్నప్పుడు, దేవుడే స్వయముగా నాతో, తన కుమారునితో, మాటలాడి, “…ఇది నాకు తెలియజేయును” యోహాను 16:14 అను తన వాగ్దానమును నెరవేర్చి, “…తన్ను తెలిసికొనుటయందు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు…” ఎఫెసీయులకు 1:17 నాకనుగ్రహించెనా? ఇప్పుడు, ఇదియే సత్యమని నేను నమ్ముచున్నాను!
“దేవునితో సహవాసము ప్రతిదినము జరుగవలెనని నీవు తలంచుచున్నావా?” అను ప్రశ్నకు జవాబిచ్చుటకు, ఈ క్రింది వచనభాగములను, వాటినిగూర్చిన కొన్ని తలంపులను నీకు తెలియజేయవలెనని కోరుచున్నాను. నీ ప్రశ్నను గూర్చి ఆలోచించుచుండగా నా మనస్సునకు ఎడతెగక వచ్చిన తలంపులివి.
ఈ వచనభాగము ప్రకారము, నిజమైన జ్ఞానమును వినుటకును జీవమును కనుగొనుటకును మార్గము అనుదినము కనిపెట్టుకొనుటయు కాచుకొనుటయునే. నిజమైన జ్ఞానము సరియైన వ్యాఖ్యానముతో మానవ బుద్ధిమాత్రముచేతనే పొందబడదు, గాని ప్రత్యక్షతచేతనే పొందబడును! క్రీస్తువాటిని తీసికొని “…మీకు తెలియజేయుదునని…” యోహాను 16:14 దేవుడు వాగ్దానము చేసియున్నాడు, దీనినే “…తన్ను తెలిసికొనుటయందు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు, మీ మనోనేత్రములు వెలిగింపబడుటయు…” ఎఫెసీయులకు 1:17,19 అందురు.
మనుష్యులు, రాజులు కోరదగిన సమస్త సంగతులలో, దావీదు ఒక్క వరమే కోరెను! ప్రభువు సన్నిధిని తన జీవితకాలమంతయు ప్రతిదినము ఉండవలెనని అతడు కోరెను. ప్రభువు ప్రసన్నతను చూడవలెననియు, దేవుని అడుగవలెననియు అతడు కోరెను.
“…దివారాత్రము…” అను మాట, నాకు సమయము దొరికినప్పుడో సౌకర్యముగా ఉన్నప్పుడో మాత్రమే చేయు అప్పుడప్పుడు జరుగు సంగతిగాక, “ఎల్లప్పుడును” జరుగు సంగతిగా, ప్రతిదినము, ప్రతిరాత్రి, నా జీవితకాలమంతయు జరుగవలసిన సంగతిగా నాకు తోచుచున్నది.
ఈ ఆత్మతృష్ణకు చిత్రముగా దేవుడు మనయందు ఉంచిన నీటిదప్పిక అనుదినమే! నేను మేల్కొను ప్రతిదినము నాకు దప్పిక కలుగుచున్నది. ప్రతిదినము మనకు ఉండవలసిన ఆత్మతృష్ణకు ఇది చిత్రము కాదా?
ఆ ప్రశ్ననుగూర్చి నేను ధ్యానించుచుండగా ప్రభువు నా మనస్సునకు తెచ్చిన కొన్ని వచనములివి. వీటినిగూర్చి ఆలోచించుచుండగా, ప్రతిదినము, వేకువనే, రాత్రియందు కూడ నా దేవుని వెదకవలెననెడి ప్రేరణ నాకు వ్యక్తిగతముగా కలుగుచున్నది.
నేను ఇట్లు తలంచుటకు కారణమేమో తిరిగి పరిశీలించుచుండగా, సహోదరుడా, ప్రభువు ఆయన సన్నిధిని నేను వెదకవలెననియు, ఆయన ప్రసన్నతను చూడవలెననియు, జ్ఞానమును మార్గదర్శకత్వమును ఆయనను అడుగవలెననియు… ప్రతిదినము… నిజముగా కోరుచున్నాడని నాకు నిశ్చయత కలిగినది.
నన్ను వాడిచేసినందుకు కృతజ్ఞతలు (సామెతలు 27:17).తోడి దాసుడు