సువార్తకు లోబడు
మరియు ఆయన సంపూర్ణసిద్ధి పొందినవాడై, మెల్కీసెదెకుయొక్క క్రమములోచేరిన ప్రధానయాజకుడని దేవునిచేత పిలువబడి, తనకు విధేయులైన వారికందరికిని నిత్య రక్షణకు కారకుడాయెను.
హెబ్రీ 5:9
కొంతమంది ఈ వచనాన్ని ఆధారం చేసుకొని మన నిత్యరక్షణ కొన్ని క్రియలమీద ఆధారపడి ఉందని బోధిస్తారు. మనం చేసే ప్రతి పనిలో ప్రభువైన యేసుక్రీస్తుకు విధేయులమై ఉండకపోతే మనం నిత్యజీవాన్ని స్వతంత్రించుకోలేం. దేవుని ఆజ్ఞలను పాటిస్తూ నడచుకొని యేసుక్రీస్తును.. నమ్ముకొని...అనే ఆజ్ఞకు విధేయులమైతే రక్షించబడతాము. 1యోహాను 3:23.
ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింపవలెననదియే.
1యోహాను 3:23
ఇందులో మారుమనస్సుకూడా ఇమిడి ఉంది. అపొస్తలుడైన పౌలు ఆజ్ఞాపిస్తున్నాడు.
ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.
అపొ 17:30-31
ప్రభువైన యేసు..పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై, దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడనివారికిని ప్రతిదండన చేయును...
2 థెస్స 1:8
విశ్వసించుచున్న మీకు, ఆయన అమూల్యమైనవాడు, విశ్వసింపనివారికైతే - ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయెను. మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు అయెను. కట్టువారు వాక్యమున కవిధేయులై తొట్రిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి.
1పేతురు 2:6-8
తీర్పు దేవుని ఇంటియొద్ద ఆరంభమగు కాలము వచ్చియున్నది; అది మనయొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి యేమవును?
1పేతురు 4:17
అయినను అందరు సువార్తకు లోబడలేదు - ప్రభువా, మేము తెలియజేసిన సమాచారమెవడు నమ్మెను. అని యెషయా చెప్పుచున్నాడు గదా?
రోమా 10:16
ఈయన నామమునిమిత్తము సమస్తజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపొస్తలత్వమును పొందితిమి.
రోమా 1:5
సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు, అనాదినుండి రహస్యముగా ఉంచబడి
యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్యదేవుని ఆజ్ఞప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడినవి. ఈ మర్మమును అనుసరించియున్న నా సువార్త ప్రకారముగాను, యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను...
రోమా 16:25-26
ముగింపులో, ప్రభువైన యేసుక్రీస్తునందు విధేయతద్వారాగాని (దేవుని క్రియద్వారా గాని) విశ్వాసముంచుట రక్షింపబడుటకవసరం.
“మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడవీలులేదు.”
ఎఫే 2:8-9