ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము...
లేఖనాల ప్రకారం మానవజాతి యావత్తు ఆత్మీయకంగా మృతమైంది. పాపాన్ని బట్టి దేవుని నుండి వేరుచేయబడి శిక్షావిధిక్రింద ఉన్నారు. క్రీస్తునంగీకరించకుండా వారు మరణించినట్లయితే అగ్నిగంధకాలతో మండుగుండమైన “రెండవ మరణము” ను అనుభవించవలసి ఉంది. మనయొక్క నీతిక్రియలన్నియు మురికిగుడ్డలవంటివని దేవుడు చెప్పినందున, మానవుడు తన్ను తాను రక్షించుకోలేని పూర్తి నిస్సహాయస్థితిలో పడిపోయాడు. సహాయము చేయువారులేరు. నిరీక్షణలేదు. అయితే దేవుడు తన కృపను బట్టి ప్రభువైన యేసుక్రీస్తును ఈలోకానికి పంపాడు. ఆయన తన మరణంద్వారా పాపరుణమంతటిని తీర్చివేశాడు. సమాధిచేయబడ్డాడు. తిరిగి మూడవదినాన లేచి ఆరోహణుడై పరలోకానికి వెళ్ళాడు. ఆయనే ఏకైక మధ్యవర్తిగా పాపాలనుండి విముక్తికలిగించాడు. యేసుక్రీస్తు మాత్రమే మరణించి శిక్షావిధిక్రింద ఉన్న పాపుల రక్షణకు ఏకైకమార్గమైనాడు. ఆయన మరణం తర్వాత జీవాన్ని వాగ్దానం చేశాడు. తీర్పులేదు, ఆధ్యాత్మికమరణం ఇంక ఎంతమాత్రమును లేదు. ఈ భౌతిక శరీరంలో ఆత్మీయజీవాన్ని కలిగియున్నాడు. ఆత్మలో తిరిగిజన్నించి నూతన జీవాన్ని పొందుటకు మానవుడు ఏం చేయగలడు?
మారుమనస్సు పొంది నమ్ముము...
“...కాలము సంపూర్ణమైయున్నది, దేవునిరాజ్యము సమీపించియున్నది;
మారుమనస్సు పొంది సువార్త నమ్ముడి.”
మార్కు 1:15
“అప్పటినుండి యేసు ప్రకటింపమొదలుపెట్టెను: మారుమనస్సు పొందుడి; పరలోకరాజ్యము సమీపించియున్నది.”
మత్తయి 4:17
మారుమనస్సు పొందుట అనగా పాపమునుగూర్చియు తననుగూర్చియు మనస్సు మార్చుకొని, పాపమునుండి తొలగి దేవునివైపు తిరుగుటయే.
“...దేవుడు...ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు:”
అపొ కార్యములు 17:30
ఈ పిలుపు మినహాయింపు లేకుండా అంతటను అందరికిని వర్తించును.
ఆయనను నమ్ము...
వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు మేమేమి చేయవలెనని ఆయన అడగగా యేసు - ఆయన పంపినవానియందు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పెను.
యోహాను 6:28,29
“...విశ్వాసముంచువాడు నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.”
యోహాను 3:16
“...విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక..”
యోహాను 3:18
“..విశ్వసించువాడే నిత్యజీవము గలవాడు..అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను..”
యోహాను 6:47
“..అయ్యలారా రక్షణపొందుటకు నేనేమి చేయవలెను. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణపొందుదురు.”
అపొస్తలుల కార్యములు 16:31
“ఆయన ఆజ్ఞ ఏదనగా - ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును ఒప్పుకొని..”
1యోహాను 3:23

నా మాటలు విని నన్ను పంపినవానియందు విశ్వసించు...
“నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవముగలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములోనుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.”
యోహాను 5:24

“తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి అనగా తనునామమందు విశ్వాసముంచినవారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తమువలననైనను శరీరేచ్ఛలవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు.”
యోహాను 1:12,13
యేసుక్రీస్తు అందరికి ప్రభువు....
మీరు మ్రానున వ్రేలాడదీసి చంపిన ఆయనను దేవుడు మూడవ దినమున లేపెను.
ఆయనయందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరు ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారు...
అపో 10:36,40,43
చంపబడిన.. యేసును.. దేవుడు మృతులలోనుండి లేపెను. మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నది...
మోషేధర్మశాస్త్రమువలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేక పోతిరో..
అపో 10:36,40,43, 13:29,38
“నీ హృదయమందు విశ్వసించినయెడల, రక్షణ కలుగునట్లు నీ నోటితో ఒప్పుకొనుము.”
రోమా 10:9,10
లేఖనాల్లో వ్రాయబడిన విధంగా, హృదయంలో విశ్వసించినవాడే దేవునిదృష్టిలో నీతిమంతుడు.
యేసుక్రీస్తు అందరికి ప్రభువు....
మీరు మ్రానున వ్రేలాడదీసి చంపిన ఆయనను దేవుడు మూడవ దినమున లేపెను.
ఆయనయందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందును... మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నది.
అపో 10:36,40,43
దేవునితో సమాధానపడుదని క్రీస్తు పక్షముగా బతిమాలుకొనుచున్నాము.
2 కొరింథి 5:20
ఆత్మయు పెండ్లికుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పిగొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.
ప్రకటన 22:17