దేవుని వాక్యమును ధ్యానించుట
ధ్యానించుటకు అనేక విభిన్న మార్గములు కలవు. ఈ పద్ధతి ప్రతి వచనమును క్రమపద్ధతిలో పరిశీలించి, దానికిని ఈ క్రిందివాటికిని గల సంబంధమును బయలుపరచును: ఒప్పుకొనవలసిన లేక విడనాడవలసిన పాపములు, దేవుని వాగ్దానములు, అనుసరించవలసిన మాదిరులు, పాటించవలసిన ఆజ్ఞలు, మరియు దేవునిగూర్చి మనము నేర్చుకొనగల జ్ఞానము.
మనము చేయు ప్రతిదానిలో ఎట్లు ఆశీర్వదింపబడి వర్ధిల్లగలమో బైబిలులో మూడు వేర్వేరు సందర్భములు తెలియజేయుచున్నవి:
“యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు
దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.
అతడు నీటికాలువల యోరను నాటబడినదై
ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును;
అతడు చేయునదంతయు సఫలమగును.”
కీర్తన 1:2-3
“ఈ ధర్మశాస్త్రగ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు.
దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు
దివారాత్రము దాని ధ్యానించినయెడల
నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు.”
యెహోషువ 1:8
“అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలుకడగా ఉండువాడెవడో
వాడు విని మరచువాడు కాక,
క్రియను చేయువాడైయుండి తన క్రియలో ధన్యుడగును.”
యాకోబు 1:25
దేవుని వాక్యమును ధ్యానించి, గ్రంథములో వ్రాయబడినదంతయు ఆచరించుటయే ప్రతి వచనములోని ముఖ్యాంశము.
మనము చేయు ప్రతిదానిలో ఆశీర్వదింపబడి వర్ధిల్లవలెనని కోరుకొనినయెడల, దేవుని వాక్యమును ధ్యానించవలెనని ఈ వచనములనుండి స్పష్టమగుచున్నది. ధ్యానించుటకు మంచి, లేఖనానుసారమైన పద్ధతి ఇక్కడ కలదు:
బైబిలులో ఒక వచనమును కనుగొనుము. ఈ వచనమును నీ సొంతమాటలలో భావానువాదము చేసి, దానిని కంఠస్థము చేసి, తరువాత ఈ క్రింది ప్రశ్నలలో ప్రతిదానిని ప్రార్థనాపూర్వకముగా పరిశీలించుము:
1. పాపములు
- విడనాడవలసిన పాపములు ఏమైనను కలవా?
“దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము
ఉపదేశించుటకును, ఖండించుటకును,
తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.
దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు.”
2 తిమోతి 3:16-17
2. వాగ్దానములు
- క్లెయిమ్ చేయవలసిన వాగ్దానములు ఏమైనను కలవా?
“తన మహిమనుబట్టియు, గుణాతిశయమునుబట్టియు,
మనలను పిలిచినవానిగూర్చిన అనుభవజ్ఞానమూలముగా
ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసినవాటినన్నిటిని
మనకు దయచేయుచున్నందున, ఆ మహిమ గుణాతిశయములనుబట్టి
ఆయన మనకు అమూల్యములును అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించియున్నాడు.
దురాశను అనుసరించుటవలన లోకమందున్న భ్రష్టత్వమును
ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని,
దేవస్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను.”
2 పేతురు 1:2,4
3. మాదిరులు
- నేను అనుసరించవలసిన మాదిరులు ఏమైనను కలవా?
“నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము
మీరును నన్ను పోలి నడుచుకొనుడి.”
1 కొరింథీయులకు 11:1
“ఏలాగు మమ్మును పోలి నడుచుకొనవలెనో మీకే తెలియును.
మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు;
ఎవనియొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు;
మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని
ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబగళ్లు పనిచేయుచు జీవనము చేసితిమి.
మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని
మమ్మును మేము మాదిరిగా కనుపరచుకొనుటకే యీలాగు చేసితిమి.”
2 థెస్సలొనీకయులకు 3:7-9
4. ఆజ్ఞలు
- పాటించవలసిన ఆజ్ఞలు ఏమైనను కలవా? యోహాను 14:21లో యేసు ఇట్లు చెప్పుచున్నాడు:
“నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు;
నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును;
నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరచుకొందునని చెప్పెను.”
యోహాను 14:21
5. జ్ఞానము
- దేవునిగూర్చి నేర్చుకొనవలసినది ఏదైనను కలదా?
“దేవునిగూర్చినట్టియు మన ప్రభువైన యేసునుగూర్చినట్టియునైన
అనుభవజ్ఞానమువలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక.”
2 పేతురు 1:3
పైన ఉన్న పద్ధతి ఆంగ్లములో SPECK (Sins, Promises, Examples, Commands, Knowledge) అని ఏర్పడుచున్నదని గమనించుము.
పైన ఉన్న ప్రశ్నలను ప్రార్థనాపూర్వకముగా పరిశీలించిన తరువాత, దేవుడు నీకు చూపినదానికి నీ ఆచరణాత్మక ప్రతిస్పందన ఏమిటి? అంతిమముగా, వాక్యమును ధ్యానించుటలోని ముఖ్యాంశము, అది చెప్పునది మనము ఆచరించగలుగుటయే. యాకోబు ఇట్లు చెప్పుచున్నాడు: “మీరు వినువారు మాత్రమేకాక వాక్యప్రకారము ప్రవర్తించువారునైయుండుడి....” (యాకోబు 1:22)
సంబంధిత వ్యాసములు
← వాక్య స్వీకరణకు తిరిగి వెళ్ళుము